పద్దతి మార్చుకో.. బండి సంజయ్కి ఎర్రబెల్లి హెచ్చరిక

పద్దతి మార్చుకో.. బండి సంజయ్కి ఎర్రబెల్లి హెచ్చరిక

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సే కవితపై చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 2023, మార్చి 11న హనుమకొండలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి..బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో పోరాడుతామన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ఉద్యమించడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక ఈడీతో దాడులు చేస్తోందని మండిపడ్డారు.

కవితను జైల్లో పెడతారని బండి సంజయ్ ముందే ఎలా చెప్పగలిగారు..అంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ దాడులు చేస్తోందనే విషయం తేటతెల్లమౌతోందని ఎర్రబెల్లి వెల్లడించారు. బండి సంజయ్ పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఈడీ కేసులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.