యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు

కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినందున.. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. యాసంగి పంట కోసం  రైతుబంధు డబ్బులు రైతులకు చెల్లించామన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో రూ.1203 కోట్లు రైతుబంధు డబ్బులు రైతులకు చెల్లించామని మంత్రి తెలిపారు. దేశంలో బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గినందున రైతులు ప్రత్యామ్నయ పంటలపై దృష్టి సారించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫాం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి గంగుల. రైతులు ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి పెట్టాలన్నారు.రైతు రాజు కావాలన్నదే తెలంగాణా ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ఇవి కూడా చదవండి:

హిందీతో మీకు కలిగే నష్టం ఏమిటి?

టీఆర్ఎస్ ప్రభుత్వంలో హమాలీలుగా నిరుద్యోగ విద్యార్థులు