మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేది లేదు

మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేది లేదు

కరీంనగర్ : మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, ఆసిఫ్ నగర్, నాగుల మాల్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో ఈ సమయంలో మిల్లులో ధాన్యం దించకుండా కేంద్రం వేధించవద్దని కోరారు. మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేదిలేదని గంగుల హెచ్చరించారు. 

రైతులు  ధర్నాలు చేసే పరిస్థితి రావద్దని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ కృషితో గణనీయంగా పంట దిగుబడి పెరిగిందన్న ఆయన.. కేంద్రం చేతులెత్తేసేంతగా తెలంగాణ రైతన్నలు వరి పండించారని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని గంగుల హామీ ఇచ్చారు. 

For more news..

కేసీఆర్ సర్కారుకు సమాధే

చారెడు పనికి టీఆర్ఎస్ బారెడు ప్రచారం