చారెడు పనికి టీఆర్ఎస్ బారెడు ప్రచారం

చారెడు పనికి టీఆర్ఎస్ బారెడు ప్రచారం

హైదరాబాద్: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నది గ్రాఫిక్స్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బాహుబలి, శివాజీ సినిమాల్లోని గ్రాఫిక్స్ తరహాలో రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని అన్నారు. ఎలాగైతే గ్రాఫిక్స్ నిజం కాదో... కేసీఆర్ మాట్లాడే అభివృద్ధి కూడా నిజం కాదన్నారు. చారెడు పనికి బారెడు ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్ ను దుయ్యబట్టారు. నోరు తెరిస్తే ఫ్రీ కరెంట్, రైతు సంక్షేమం అంటూ  డబ్బా కొట్టుకుంటున్నారని... అసలు కేసీఆర్ వచ్చాకే కరెంట్ పుట్టినట్లు, రైతులు వ్యవసాయం చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ అని పేర్కొన్న ఆయన... రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్దేనని కొనియాడారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాహుల్ ఓయూ పర్యటన, వరంగల్ సభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిని అవసరం ఉందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ