ఇజ్రాయెల్‌‌లో ఫౌదా టీంతో ప్రధాని మోదీ సెల్ఫీ.. గొప్ప గౌరవం అన్న లియోర్ రాజ్

ఇజ్రాయెల్‌‌లో  ఫౌదా టీంతో ప్రధాని మోదీ  సెల్ఫీ.. గొప్ప గౌరవం అన్న లియోర్ రాజ్
  • ఇది తమకు ‘గొప్ప గౌరవం’ అని అభివర్ణించిన లియోర్ రాజ్

జెరూసలెం: ఇజ్రాయెల్​లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని  ‘ఫౌదా’ వెబ్ సిరీస్ నటులు కలుసుకున్నారు. భారత ప్రధానితో సెల్ఫీ దిగారు.  ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ‌‌తో చర్చలు, ఇతర అధికారిక కార్యక్రమాల మధ్యలో గురువారం ఫౌదా టీమ్​లోని లియోర్ రాజ్, అవి ఇస్సాచరోఫ్, త్సాహి హలేవి ఇతరులతో దిగిన ఫొటోను తన ఎక్స్ ​ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి ‘‘థ్యాంక్​ఫుల్లీ, ఈ సంభాషణకు సెల్ఫీ మాత్రమే అవసరం. రహస్య మిషన్​ఏమీ లేదు!’’ అని రాసుకొచ్చారు. 

ఈ ఘటనపై ఫౌదా స్టార్, లీడ్ యాక్టర్ లియోర్ రాజ్ మాట్లాడుతూ.. “ఇది మాకు ఎంతో అద్భుతమైన క్షణం. భారత ప్రధానిని కలవడం చాలా గౌరవంగా ఉంది. మా వెబ్ సిరీస్​కు భారతదేశంలో మాకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారని మాకు తెలుసు. మీ ప్రధానమంత్రి నుంచి ఈ గౌరవాన్ని అందుకోవడం మాకు గర్వకారణం. మీ దేశంలో నటన, నిర్మాణం, కళకు ఆయన ఎలా మద్దతు ఇస్తారో చూడటం చాలా బాగుంది. ఇది మా దేశంలో కూడా నేర్చుకోవాల్సిన విషయం అని నేను భావిస్తున్నాను” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

ఫౌదా అంటే అరబిక్‌‌లో ‘కాస్’ అని అర్థం. ఇజ్రాయెల్​లో అత్యంత పాపులర్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్. ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లో అండర్‌‌ కవర్ ఏజెంట్లు పాలస్తీనియన్ టెర్రరిస్టులను ట్రాక్ చేసే కథ.