- మార్చి 2 నుంచి 31 వరకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి, భారత్ లో ప్రాక్టీస్ కోసం నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్ట్ రాసే అభ్యర్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక సూచన చేసింది. రానున్న నెలల్లో జరగబోయే ఈ ఎగ్జామ్ కు హాజరు కావడానికి తప్పనిసరి అయిన ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ జారీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
మార్చి 2 ఉదయం 10 గంటల నుంచి మార్చి 31 సాయంత్రం 6 గంటల వరకు ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలను, మొబైల్ నంబర్‌ను స్వయంగా సరిచూసుకొని తప్పులు లేకుండా నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు స్థితిగతులను తెలుసుకునేందుకు eligibility.regn@nmc.org.in మెయిల్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
