ప్రాగ్ చెస్ ఫెస్టివల్‌‌లో సంచలనం: నీమన్‌కు అరవింద్ చెక్

ప్రాగ్ చెస్ ఫెస్టివల్‌‌లో సంచలనం: నీమన్‌కు అరవింద్ చెక్

ప్రాగ్‌‌: ఇండియా గ్రాండ్ మాస్టర్‌‌‌‌, డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం ప్రాగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌‌లో సంచలనం సృష్టించాడు. అమెరికా టాప్ ప్లేయర్ హాన్ మోక్ నీమన్‌‌పై విజయం సాధించాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్‌‌లో నల్ల పావులతో ఆడుతూ 53 ఎత్తుల్లో నీమన్‌‌కు చెక్‌‌ పెట్టాడు. 

మరోవైపు వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌‌ వరుసగా రెండో గేమ్‌‌లో డ్రాతో సరిపెట్టాడు. తెల్లపావులతో ఆడినప్పటికీ ఉజ్బెకిస్తాన్‌‌కు చెందిన నోదిర్‌‌బెక్ యాకుబోవ్‌‌తో గేమ్‌‌ను 30 ఎత్తుల్లోనే  డ్రాగా ముగించాడు.  చాలెంజర్స్ విభాగంలో దివ్య దేశ్‌‌ముఖ్  రెండో రౌండ్‌‌లో స్పెయిన్‌‌కు చెందిన డానియల్ యుఫాతో గేమ్‌‌ను డ్రా చేసుకుంది.