ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ

దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లీం సోదరులు.  ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రంజాన్ అంటే సేవకు నిదర్శనమన్నారు బాలకృష్ణ. ఈ రంజాన్ తో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠోర ఉపవాసం తర్వాత రంజాన్ జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ జరుపుకోవాలన్నారు బాలకృష్ణ.