ఆందోళనల్లో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించండి

ఆందోళనల్లో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించండి

అగ్ని పథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో  జరిగిన ఆందోళనల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్ రావు డాక్టర్లను ఆదేశించారు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జ్లో గాయపడిన 13 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్సను అందించాలని గాంధీ హాస్పిటల్ వైద్యులకు మంత్రి హరీష్ రావు సూచించారు.