
సంగారెడ్డి జిల్లా : ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడే విద్యార్థుల దిశ, దశ మారుతుంది అన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరులో కొత్తగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు భవనాన్ని సోమవారం ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు.. పిల్లలు ఆడుకోవడానికి మంచి స్టేడియం ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు స్కూల్లో చూపించిన ఇంట్రెస్ట్ ఇంటర్, డిగ్రీలో చూపిస్తే లైఫ్ లో సక్సెస్ అవుతారన్నారు. పదోతరగతిలో వంద శాతం ఫలితాలు వస్తే.. ఇంటర్ లో 33శాతానికి, డిగ్రీలో 49 శాతానికి ఎందుకు ఫలితాలు పడిపోయాయని అన్నారు. ఇంటర్ , డిగ్రీలో వందకు వంద శాతం ఫలితతాలు రావాలని విద్యార్థులకు సూచించిన మంత్రి.. మార్చి నాలుగు నుంచి ఇంటర్ పరీక్షలని బాగా రాయలన్నారు.
ఈ 75 రోజులు పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులకు చెప్పారు. రెండు రోజుల్లో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మద్యాహ్నం బోజనం, సాయంత్రం స్నాక్స్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెప్పారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పేద కార్మిక విద్యార్థులు చదువు తున్నారని.. కార్మికుకుల పిల్లలు కార్మికులు కావద్దన్నారు. ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని..ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ విద్యార్థుల దిశ, దశ మారుస్తుందన్నారు. ఈ సమయంలోనే వారిని అధ్యాపకులు, తల్లిదండ్రులు మంచిగా మలిచితే విద్యార్థులు గొప్పవారవుతారన్నారు. పిల్లల్లో చగువులతో పాటు నైతిక విలువలు, సంప్రదాయాలు, సామాజిక స్పృహను పెంచాలన్నారు.
కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నత వ్యక్తులతో ప్రత్యేక తరగతులు నిర్వహించి పిల్లల్లో సామాజిక బాధ్యత నేర్పాలని తెలిపారు. ఆడపిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంచాలని.. 100కు ఎందుకు డయల్ చేయాలో వారికి వివరించాలన్నారు. ర్యాంకులు, మార్కులతో పాటు.. వాటి కన్నా నైతిక విలువలు ఇంకా ముఖ్యమన్న మంత్రి..విద్యార్థులు సోషల్ మీడియా, టీవీలు, సినిమాలకు దూరంగా ఉండాలని సూచించారు.