ఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు: హరీశ్ రావు

ఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు: హరీశ్ రావు

రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారని, అసలు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో  ఇలాంటి డబుల్ బెడ్రూం  ఇండ్లు ఉన్నాయా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. కొన్ని రాజకీయ  పార్టీల జీవిత మంతా ధర్నాలే అని ప్రతిపక్షాలకు ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్రజలను గత ప్రభుత్వాలు పట్టించుకోదన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పేదలను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయని వాటిని నమ్మవద్దని కోరారు. కేసీఆర్ హయాంలో మంచినీళ్లు అందించామని,నీళ్ల కోసం ధర్నాలు లేనే లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పారని, పనులు చేసి  చూపించలేదని మండిపడ్డారు. పనిచేసే వారెవరో,మాటలు చెప్పే వారెవరో దయచేసి ఆలోచించాలని కోరారు. 

ఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు

 ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రూ. 70 లక్షల విలువ చేసే ఇండ్లను మీ చేతుల్లో పెడుతున్నామని... దయచేసి ఈ ఇండ్లను అమ్ముకోవద్దన్నారు హరీశ్ రావు. ఈ ఇండ్లలో పది కాలాల పాటు ఆత్మగౌరవంతో ఉండాలన్నారు. మీరందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని  సీఎం కేసీఆర్ దీవించాలని కోరారు.  ఎన్నికల ముందు అనేక రాజకీయ పార్టీల నాయకులు వస్తారని..అందమైన నినాదాలు ఇస్తుంటారు మనకు కావాల్సింది నినాదాలు కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వాళ్లన్నారు.  ప్రజల కలలను నిజం చేసే నాయకుడు  కేసీఆర్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు.