మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఎంక్వైరీ జరుగుతున్నది : హరీశ్​రావు

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఎంక్వైరీ జరుగుతున్నది : హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై విచార​ణ జరుగుతున్నదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు మేడిగడ్డ బ్యారేజీపై అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్​డామేజ్ అయిందని తెలిపారు. ఇందుకు కారణాలు ఏంటీ అనేది స్పష్టంగా తెలియదన్నారు. పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని కొందరు ఇంజినీర్లు చెప్తున్నారు.

ఇందులో కుట్ర కోణం ఉందని కూడా అనుమానిస్తున్నారని చెప్పారు. దీనిపై దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి. దీనిపై రిపోర్టు త్వరలోనే వస్తుంది. ఇంజినీర్లు డిజైన్లపై డిస్కస్ చేస్తున్నారు. ‘బ్యారేజీ మెయింటనెన్స్, గ్యారంటీ పీరియడ్ లో ఉంది. సంబంధిత వర్క్ ఏజెన్సీ రెండు నెలల లోపే ఆ పనులు పూర్తి చేస్తుంది. రైతులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదు. అక్కడ ఏం జరిగినప్పటికీ తర్వలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తం’ అని చెప్పారు.