ఓల్డ్‌సిటీ, వెలుగు: రైల్వే ప్రొటెక్షన్‌ఫోర్స్26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ (ఏఐపీబీసీ)ను రెండో రోజు బుధవారం చార్మినార్‌వద్ద నిర్వహించారు. 24 రాష్ట్రాల నుంచి 24 బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. పోలీస్బ్యాండ్సంప్రదాయాలు, సంగీత నైపుణ్యాలను ప్రదర్శించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పోటీలు చార్మినార్‌కు వచ్చిన సందర్శకులను ఆకర్షించాయి. పోటీలను ఐఆర్పీఎఫ్ఎస్ ఐజీ అవోమా సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.
