ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి 19న జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను వీసీ ప్రొ.కుమార్ ఆహ్వానించారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో ప్రారంభోత్సవ సమావేశానికి రావాలని కోరారు.
