ఢిల్లీ పొల్యూషన్ కట్టడికి.. ట్రాన్స్ పోర్టు ఎన్ ఫోర్స్ మెంట్ టీం స్పెషల్ డ్రైవ్

ఢిల్లీ పొల్యూషన్ కట్టడికి.. ట్రాన్స్ పోర్టు ఎన్ ఫోర్స్ మెంట్ టీం స్పెషల్ డ్రైవ్

ఢిల్లీ ప్రజలను ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. గత కొద్ది రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో నమోదు అవుతోంది. ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి..అనారోగ్య సమస్యలు తలెత్తి ఆస్పత్రుల పాలవుతున్నారు.  గాలి కాలుష్యం కారణంగా విజిబులిటీ తగ్గి  ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.. అంతేకాదు క్రికెట్ లాంటి గేమ్  ఈవెంట్స్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్ అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. 

గురువారం ( డిసెంబర్ 18) నుంచి గాలి కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలకు పెట్రోల్ డీజిల్ సరఫరాను నిలిపివేసింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్యనియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్  బంద్ చేసింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు (ANPR) కెమెరాలు, పెట్రోల్ పంపుల దగ్గర వాయిస్ అలర్ట్ సిస్టమ్‌లు , ఢిల్లీ పోలీసు సిబ్బంది సపోర్టుతో ఉపయోగించి కట్టుదిట్టంగా కాలుష్య  నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు. 

మరోవైపు ఢిల్లీ, NCR పరిధిలో నిర్మాణ పనులు నిలిపివేశారు. నిర్మాణ సామాగ్రిని తరలించే ట్రక్కులను నగరంలోకి అనుమతించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో 126 చెక్ పోస్టులను ఏర్పాటుచేసి,   580 పోలీస్ సిబ్బందితో ఇతర రాష్ట్రాలనుంచే వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు.