
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో త్వరలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు 30% పెంపు చేసామన్నారు. 500 కోట్లు మండల అభివృద్ధి పనులకు విడుదల చేసామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విస్మరించింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు నిధులను విడుదల చేసిందన్నారు. అంతేకాదు ..బీజేపీ ప్రభుత్వం వచ్చి ధరలు పెంచింది తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.బారాణ పెంచి చారాన దించి ..గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
2014 లో కాంగ్రెస్ హయాంలో సిలెండర్ ధర రూ.4 వందలు, బీజేపీ ప్రభుత్వం రూ. 1050 కి పెంచారని తెలిపారు మంత్రి హరీశ్. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆ పార్టీ పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 5 లక్షల పరిహారం ఇస్తున్నామని తెలిపారు. పఠాన్ చెరు లో అనుకోని రీతిలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరారు మంత్రి హరీశ్.
అంతేకాదు కరోనా వ్యాక్సిన్ ను అందరూ వేసుకోవాలని కోరారు మంత్రి హరీశ్ రావు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా బాధ్యతగా కృషి చేయాలన్నారు.