
దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి అయ్యిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ కోటి మెడికల్ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబురాలుచేసుకున్నారు మెడికల్ ఎంప్లాయిస్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. వంద శాతం ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని.. వైద్యారోగ్య సిబ్బంది కృషే దీనికి కారణమన్నారు. వ్యాక్సినేషన్ పై మొదటి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు.. స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని చెప్పారు.
ఆశా వర్కర్లు, ANMలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారన్నారు మంత్రి హరీశ్. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వ్యాక్సినేషన్ లో పాల్గొన్నారని అన్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు అధికారులు కలిసి పని చేశారని..ప్రస్తుతం వ్యాక్సిన్ వేసేందుకు 7,970 సెంటర్లు పని చేస్తున్నాయని తెలిపారు. మొత్తంగా 2కోట్ల 77లక్షల మందికి ఫస్ట్ డోస్ వేశామన్నారు.
జనవరి 3 నుంచి 15 నుంచి 18 వయసు వారికి హైదరాబాద్ , మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్ల తెలిపారు మంత్రి హరీశ్ రావు. ముందుగా కోవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2007 ఏళ్లు .. దాని కంటే ముందు పుట్టిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. కోవాగ్జిన్ ఇవ్వాలని కేంద్రం తెలిపిందన్నారు.
మరిన్ని వార్తల కోసం..