దేశ భక్తి మాత్రం ఉంటే చాలదు.. స్వరాష్ట్ర భక్తి కూడా ఉండాలి

దేశ భక్తి మాత్రం ఉంటే చాలదు.. స్వరాష్ట్ర భక్తి కూడా ఉండాలి

దేశ భక్తి మాత్రం ఉంటే చాలదని... స్వరాష్ట్ర భక్తి కూడా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేతలను ఉద్దేశించి పైవ్యాఖ్యలు చేశారు. క్షుద్ర రాజకీయాలు చేయడం బీజేపీ నేతలకు తగదని ఆయన అన్నారు. ‘ఇక్కడి ప్రజలు గెలిపిస్తే అక్కడికి వెళ్లిన వాళ్ళు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. ప్రతి పౌరునికి దేశ భక్తి ఉంటుంది. రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా ప్రవర్తిస్తారా? చేతనైన సాయం చేయాలి కానీ కాళ్లలో కట్టెలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ప్రాజెక్టులు కట్టొద్దు.. అనుమతులు రావద్దన్నట్లు బీజేపీ ప్రవర్తిస్తోంది. పోతిరెడ్డిపాడును ఆపే విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. సీడబ్ల్యూసీ మరియు గ్రీన్ ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టులో కేసు కూడా వేశాం. అయినా ఏపీ ప్రభుత్వం పనులు చేస్తుంది. ఆనాడు వైస్సార్ కూడా పోతిరెడ్డిపాడు కడుతుంటే మేం వ్యతిరేకించి మంత్రి వర్గం నుంచి బయటికి వచ్చాం. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాకే ప్రాజెక్టులను స్టార్ట్ చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు అంచనాలు ఎందుకు పెరిగాయో చెప్పాలి’ అని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.