వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. భారీ వర్షాలకు పత్తి, వరి పంటలు నీటమునిగాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలిపోతున్నాయి. ముందస్తు చర్యలుగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  వర్షాభావ పరిస్థితుల పై అధికారులతో  మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, భగత్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.