కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి జూపల్లి

కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి జూపల్లి
  •  అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తా : మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. 'సర్' కార్యక్రమంపై ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆఫీసర్ల తీరు పైనే కాకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమస్యలను ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తల కోసం తాను గళమెత్తుతానన్నారు.

కొందరు ఆఫీసర్ల తీరుపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని, పరిపాలనపరమైన అంశాలను కేబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. సర్ పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు నెల రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా చూడాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నిర్మల్ నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేశ్ పాల్గొన్నారు.  అనంతరం ఏంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావుపటేల్, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకీ షర్మిల, మున్సిపల్ చైర్ పర్సన్ దత్తాద్రితో కలిసి భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు బాసర అభివృద్ధి పనుల టెండర్లను వేగవంతం చేయాలి

బాసర అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతంగా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆదివారం ఉదయం బాసర సరస్వతీ దేవిని దర్శించుకొని పూజలు చేశారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ఆలయ ఈవో అంజనాదేవితో సమీక్షించారు.