హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, జల వనరులు, దట్టమైన అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ, మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
పర్యాటక ప్రాంతాల్లో వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందు కు నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో హైద రాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణకు అధ్యయనం చేయాలన్నారు. పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ సమన్వయం తో నగర సుందరీకరణలో భాగంగా శిల్పా లు, ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్, స్కై వాక్ లు సృజనాత్మక ఉట్టిపడేలా తీర్చిది ద్దాలని చెప్పారు.
స్పెషల్ సీఎస్ వాణి ప్రసా ద్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం లక్ష్మణ్ రంజిత్ నాయక్, కమిటీ సభ్యులు పాపారావు, కమలవర్ధన్ రావు, బాలాజీ, జుల్ఫీ, మార్గ్ పటేల్, రాందేవ్ రావు ఉన్నారు.

