డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ లోగోను.. ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ లోగోను.. ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బుక్ ఫెయిర్–38 లోగోను గురువారం రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. డిసెంబర్19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫెయిర్ జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 

యువకులు, విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్​లో ప్రభాతభేరి పేరిట విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యక స్టాల్, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతికశాఖ  కార్యక్రమాల ప్రచార స్టాల్స్ ను  కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.