
దివంగత సీనియర్ నేత జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి . రాజకీయాల్లోకి వచ్చే యువత జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు . జైపాల్ రెడ్డి వర్థంతి సందర్భంగా పీవీ ఎన్ఆర్ మార్గ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జైపాల్ రెడ్డి గారి గురించి చెప్పే అంత పెద్ద స్థాయి నాది కాదు. ప్రపంచ దేశాలు గుర్తించే నాయకుడు జైపాల్ రెడ్డి. అంగవైకల్యం ఉన్న కూడా విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ నేతగా ఎదిగాడు. దక్షిణ భారత్ లో బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎన్నికైన మొదట వ్యక్తి. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ నేను ఇంజనీరింగ్ లో క్లాస్ మెట్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఆయన ప్రభావం కూడా ఉంది. ప్రపంచ స్థాయిలో మెట్రో వచింది అంటే అది జైపాల్ రెడ్డి కృషి. ప్రజల కోసం నిజాయితిగా పని చేసిన నాయకుడు జైపాల్ రెడ్డి. తెలంగాణ రావడంలో కీలక పాత్ర జైపాల్ రెడ్డిది. ఆయన పార్లమెంట్ లో మాట్లాడే సమయంలో ఆయన వాడే ఇంగ్లీష్ పదాలు అద్భుతం అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ALSO READ : అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి
ఆయన అందరికి ఆదర్శం: పొన్నం
మేము కొత్తగా పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పుడు జైపాల్ రెడ్డి దగ్గర పార్లమెంటరీ విధానం తెలుసుకున్నాం. చాలా సార్లు ఉద్యమ సమయంలో ఎంపీలు అందరం ఆయనతో సమావేశం అయ్యాం. ఏ విధంగా ముందుకు వేలాలి అనే దానిపై ఆయన సూచనలు చేశారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన పాత్ర కీలకం. ఆయన రాజకీయ జీవితం ఆదర్శం. విద్యార్థి దశ నుంచి జైపాల్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. హైద్రాబాద్ మెట్రో, అర్బన్ డెవలప్ మెంట్ విషయంలో ఆయన పాత్ర ఉంది. ఈ తరం జైపాల్ రెడ్డి ని ఆదర్శనంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.