ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నరు..కేంద్రంపై మంత్రి వెంకట్ రెడ్డి ఫైర్

ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నరు..కేంద్రంపై మంత్రి వెంకట్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నదని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌‌‌‌లను ఆయన ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఫైర్ అయ్యారు. దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం మొదలైందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

మూగ బాలిక వైద్యం కోసం రూ.2 లక్షల సాయం

నల్గొండ జిల్లా పణిగిరి గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక వైద్య చికిత్స కోసం మంత్రి కోమటిరెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. జంపాల మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రజిత దంపతులు ఇద్దరూ మూగ, చెవిటి వారు. వారికి జన్మించిన బిడ్డ కూడా మూగ, చెవిటి తనంతో పుట్టడంతో ఆ తల్లిదండ్రుల జీవితాల్లో విషాదం నెలకొంది. తమ బిడ్డకు సరైన వైద్యం అందించడానికి లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పగా ఆ దంపతులు మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన వెంటనే రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.