బాధితులకు న్యాయం జరుగుతుంది.. హామీ ఇస్తున్నా

బాధితులకు న్యాయం జరుగుతుంది.. హామీ ఇస్తున్నా

భైంసా గొడవల్లో బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. హింస కారకులపై కఠిన చర్యలు తీసుకోవలాని హోంమంత్రి ఆలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలను కోరానన్నారు కేటీఆర్. సమాజంలో శాంతి, సోదరభావం నింపడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎటువంటి సంఘ విద్రోహ చర్యలను తెలంగాణ ప్రభుత్వం సహించదన్నారు కేటీఆర్. విభజన శక్తుల రెచ్చగొట్టే మాటలు, వదంతులు నమ్మొద్దని భైంసా ప్రజలను కోరుతున్నానని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.