హైదరాబాద్: దేశంలోని వనరులను సరిగా వాడుకుంటే అభివృద్ధిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అంశంపై ఆదివారం హార్వర్డ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన బేగంపేట క్యాంపు ఆఫీస్ నుంచి పాల్గొని మాట్లాడారు. దేశంలో అభివృద్ధి మరింత వేగంగా, విప్లవాత్మకంగా ముందుకు సాగాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే పత్తి పండించే అతిపెద్ద దేశంగా ఉన్నా ఇండియా.. బంగ్లాదేశ్, శ్రీలంకలకు మించి బట్టలు ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతోందో ప్రశ్నించుకోవాలన్నారు. ఇండియా కన్నా చిన్నవైన వియత్నాం, తైవాన్ తదితర దేశాలు ప్రొడక్షన్ సెక్టార్‌లో అగ్రగామిగా ఉన్నాయని, దేశానికి అడ్డుతగులుతున్న పరిస్థితులు ఏమిటో సరిచూసుకోవాలన్నారు. ఏడున్నరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ దేశానికి పాఠాలు నేర్పేలా ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్అన్నారు. వివిధ సంస్కరణలతో అభివృద్ధిలో ముందున్నామని కేటీఆర్ చెప్పారు.
