నాలా ప్రమాదాలు జరిగితే అధికారులదే బాధ్యత

నాలా ప్రమాదాలు జరిగితే అధికారులదే బాధ్యత

వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ అమలుపై ఇవాళ(మంగళవారం) అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని.. నాలాలకు ఫెన్సింగ్, రక్షణ గోడ ఏర్పాటు చేయాలని సూచించారు. నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నాలా ప్రమాదాలు జరగకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పనులను జీహెచ్ఎంసీ కమిషనర్  ప్రతివారం సమీక్షించాలని, మేజర్ కార్పొరేషన్ లోనూ  నాలాలపై రక్షణ చర్యలకు కార్యాచరణ రెడీ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

నేనే నెంబర్ వన్... ముచ్చటగా మూడోసారి మోడీ