పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరు కల్లా పూర్తిచేయాలి

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరు కల్లా పూర్తిచేయాలి

హైదరాబాద్: ఫిబ్ర‌వ‌రి నెలాఖరు నాటికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో.. పార్టీ సభ్యత్వ నమోదు తోపాటు, మెంబర్‌షిప్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని సైతం సమాంతరంగా కొనసాగించాలని పార్టీ ఇన్‌చార్జ్ ల‌కు సూచించారు కేటీఆర్. పార్టీ సభ్యత్వ నమోదు పైన జిల్లాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు,

పార్టీ సభ్యత్వ నమోదు కి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని , ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిర్ధారిత లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ నిర్ణయించుకున్న లక్ష్యం మించి సభ్యత్వ నమోదు విజయవంతం కాబోతున్నదని, సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులంతా కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మ‌రింత‌ విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు. స‌భ్య‌త్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న తీరు పైన సంతృప్తి వ్యక్తం చేశారు