ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు

ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు

భారత దేశంలో నిర్మించిన మొత్తం ఇండ్లు ఒకెత్తు అయితే.. మన రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు మరో ఎత్తు అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లాంటి పథకం 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు. రూ. 1800 కోట్ల రూపాయలతో డబల్ బెడ్ రూం ఇండ్లకు శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజక వర్గంలోని బన్సీలాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ లో నిర్మించిన 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు  మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇలాంటి ఇల్లు రూ. 45 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు.  భారత దేశంలోని 28 రాష్ట్రాల్లో ఇల్లు కోసం ఎంత ఖర్చు చేశారో..  తెలంగాణలో డబల్ బెడ్ రూం ఇండ్ల కోసం అంత  కంటే ఎక్కువ ఖర్చు చేశామన్నారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన అన్నా రు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇక్కడ ఇల్లు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు దొరకని వారికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామన్నారు కేటీఆర్. ఇండ్ల కేటాయింపులన్నీ లాటరీ పద్దతిలోనే  ఇస్తామన్నారు. డబ్బులు ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి ఉచితంగా ఇస్తున్నామన్నారు. 

ఇవి కూడా చదవండి: 

ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్

కుర్చీలు లేక గర్భవతుల అవస్థలు