పట్నం అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష

పట్నం అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష

GHMC ఆఫీస్ లో మేయర్ బొంతు రామ్మోహన్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అధికారులతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. నగరంలో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  జంక్షన్ ఇంప్రూమెంట్,  ఫుట్ పాత్ నిర్మాణం,  స్కై వాక్, ట్రాఫిక్ సిగ్నల్స్,  బస్ షెల్టర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. తదితర అంశాలపై ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ పరిధిలో ప్లాన్ చేసిన కొత్త రోడ్లు ఎదురవుతున్న సమస్యలు,  రోడ్డు వైండింగ్ భూసేకరణ ఇబ్బందులు, LRS దరఖాస్తుల పరిశీలన,  DPMS విధానంలో ఇబ్బందులపై.. టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించారు కేటీఆర్.