జూబ్లీహిల్స్ లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

జూబ్లీహిల్స్ లో స్టీల్ బ్రిడ్జిని  ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: జూబ్లిహిల్స్ సైలెంట్ వ్యాలీ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 30.30 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. మొత్తం నాలుగు లేన్లతో మొత్తం 350 మీటర్ల పొడవు, 17.50 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం వల్ల షేక్ పేట నుంచి రోడ్ నంబర్ 45కు మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల దూరం తగ్గనుందని ప్రభుత్వం చెబుతోంది. కేటీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.