హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీలా చేయడమే లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీలా చేయడమే లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీలాగా తయారుచేయడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో అద్భుతమైన ఎకో స్టార్టప్ సిస్టం డెవలప్మెంట్ అయిందన్నారు. టీహబ్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు స్టార్టప్లకు అవార్డులను అందజేశారు. టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. హైదరాబాద్లో 8వేలకు పైగా స్టార్టప్స్ ఉన్నాయని.. అనేక రంగాలకు సంబంధించిన స్టార్టప్స్ టీహబ్లో ఇంక్యుబేట్ అయినట్లు తెలిపారు.

ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు టీహబ్ పరిశీలనకు వస్తున్నారని చెప్పారు. స్టార్టప్స్ కు అద్భుతమైన ఫండింగ్ చేయడంలో టీహబ్ ముందుందన్నారు. ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో టీ హబ్ నిర్మాణం జరిగిందన్నారు. యంగ్ పారిశ్రామికవేతలను తయారు చేయడమే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. స్టార్టప్స్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇన్నోవేటర్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.