హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. పూర్తి వివరాలు..

హైదరాబాద్ లో  డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. పూర్తి వివరాలు..

మెట్రో పై తెలంగాణ  కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో రూ. 60 వేల కోట్లతో మెట్రోను విస్తరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.   జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు  డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు.. ఒక లేన్‌లో మెట్రో రైలు..మరో లేన్‌లో వాహనాలు వెళ్లేలా ఈ డబుల్ డెక్కర్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు.మూడు నాలుగేళ్లలో మెట్రో రైల్ పొడిగింపు  పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.

 మెట్రో పొడిగింపు ఇలా...

  • రాయదుర్గం నుంచి శంషాద్ బాద్ వరకు మెట్రో పొడిగింపు
  • ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు
  • మియాపూర్  నుంచి ఎల్బీనగర్ వరకు 
  • ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట 
  • విజయవాడ రూట్ నుంచి పెద్ద అంబర్ పేట
  • నిజామాబాద్ రూట్ నుంచి కండ్ల కోయదాకా 
  • ఉప్పల్ నుంచి బీబీ నగర్, ఈసీఐఎల్ దాకా మెట్రో 
  • షాద్ నగర్ వరకు మెట్రో రైల్ విస్తరణ 
  •  ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు 
  • జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్