
ప్రైవేట్ డంప్ యార్డ్ నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని..అవసరమైతే పోలీస్ కేసు పెట్టాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఏ శాఖ అధికారులైన జీహెచ్ఎంసీ అనుమతిచ్చాకే నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీది ముఖ్య పాత్రని చెప్పారు. సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక్కదగ్గర ఉండాలన్న లక్ష్యంతో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేశామన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ 8 వేల టన్నులు దాటిపోయిందన్నారు కేటీఆర్.
- ALSO READ: మోకిలా భూములకు కొనసాగుతున్న వేలం పాట
డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంప్ యార్డ్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనావాసాలకు దూరంగా ఉండేలా, హైదరాబాద్ కు 50ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. వచ్చే చెత్తను వేరు చేసేందుకు, విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఉండాలన్నారు. వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించిన క్వారీలను ఉపయోగించుకోవాలని చెప్పారు. దుండిగల్, ఖానపూర్, ప్యారా నగర్ డంప్ యార్డ్ ల అంశంలో వారంలో పూర్తి నివేదిక సమర్పించాలన్నారు.