ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే : కేటీఆర్

ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే అని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలంటే కష్టపడాలని, దేశ విదేశాల నుండి పోటీలను తట్టుకోవాలని, దీనికోసం అన్ని దేశాలను సందర్శిస్తున్నామని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలనేదే తమ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. ప్రైవేటు సెక్టార్ లో మంచి జీతం వస్తున్న ఎంతోమంది.. నైపుణ్యం కలిగిన అధికారులు.. తమకు ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కి కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాయదుర్గంలోని టీ హబ్ లో నిర్వహించిన "తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్,టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ రాష్ట్ర టెక్నికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) చైర్మన్‌ పాటిమీది జగన్‌ మోహన్ తోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ వచ్చిన కొత్తలో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు.. కానీ ఇప్పుడు 2.40 కోట్లకు చేరాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం ఐటీ రంగంలోనే కాదు.. అన్ని రంగాలలోనూ తెలంగాణ ముందుందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా తెలంగాణ మారిందని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భారతదేశంలోని చిన్న రాష్ట్రమైన తెలంగాణ నిర్మించిందని చెప్పారు. 

https://twitter.com/JAGANBRS/status/1666081622331105280