కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!

కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!

నల్గొండ జిల్లాలో  మంత్రి కేటీఆర్  సంతకం  ఫోర్జరీ  చేసిన  ఘటన వెలుగు చూసింది.  జిల్లాలోని  రావులపెంట   ప్రభుత్వ ఉన్నత  పాఠశాలలో  హెడ్ మాస్టర్ గా  పని చేస్తున్న  మంగళ  అనే టీచర్…. కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు  ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు. జిల్లా  విద్యాశాఖ  కో ఆర్డినేటర్ గానూ  మంగళ  కొనసాగుతున్నారు. అయితే  కో ఆర్డినేటర్  పదవిలో ఉండేందుకు  మంత్రి కేటీఆర్   రికమండేషన్  లెటర్ ను  ఆయన సంతకం ఫోర్జరీ  చేసి  అందించినట్లు  ఆరోపణలు ఉన్నాయి. అయితే  తాను ఫోర్జరీ చేయలేదని   ఏ విచారణకైనా  సిద్ధమని…. టీచర్  మంగళ  చెబుతున్నట్లు తెలిసింది. మరోవైపు  సంతకం ఫోర్జరపై   మంత్రి కేటీఆర్  పేషీ  ఆరా తీసినట్లు తెలిసింది.