లైఫ్ స్టైల్ మార్చాలి.. కారు, బైక్ కాదు సైకిల్స్ వాడాలి

లైఫ్ స్టైల్ మార్చాలి.. కారు, బైక్ కాదు సైకిల్స్ వాడాలి

లైఫ్ స్టైల్ మార్చాల్సిన అవసరముందని.. హెల్త్ పై అందరూ దృష్టిపెట్టాలని సూచించారు  మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నార్సింగి దగ్గర సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డబ్బు సంపాదించిన కొద్దీ హెల్త్ పై అవర్నెస్ తగ్గిపోతుందన్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే  కారు లేదా బైక్ వాడుతున్నారని చెప్పారు. లగ్జరీ లైఫ్  కావాలనుకుంటూ హెల్త్ ను పట్టించుకోవడం లేదని చెప్పారు.  విదేశాల్లో మాదిరి మనదగ్గర కూడా సైకిల్స్ వాడాలన్నారు . ఈ సైకిల్ ట్రాక్ అందుకే ఏర్పాటు చేశామని.. ఇది కేవలం ఒక్క అడుగు మాత్రమేనని.. సిటీ మొత్తం సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు కేటీఆర్.

సైక్లింగ్ ని ప్రమోట్ చేయడం వల్ల పొల్యూషన్ ని తగ్గించవచ్చన్నారు కేటీఆర్. 2040 కల్లా హైదరాబాద్ ని కార్బన్ ఎమిషన్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ద్యేయమని చెప్పారు.  స్పోర్ట్స్ ను ప్రమోట్ చేసేందుకు స్కేటింగ్ రింగ్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.  సైక్లింగ్ ని ప్రమోట్ చేస్తున్న హైదరబాద్ సైక్లింగ్ గ్రూప్ కి నా ధన్యవాదాలు తెలిపారు. ట్రాక్ ని అందరు ఉపయోగించుకోవాలన్నారు.  

Also Read :- దేశంలోనే మొట్టమొదటి సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ ఇదే

 

హైదరాబాద్ నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని నిర్మించింది హెచ్ఎండీఏ. దేశంలో మొదటి సోలార్ సైకిల్ ట్రాక్ ఇదే కావడం విశేషం. నానక్ రామ్ గూడ నుంచి టీఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు ,  నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు మేర  మూడు లేన్ లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పు ట్రాక్, ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ,21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు... లైట్స్ ఏర్పాటు చేశారు.సైక్లిస్ట్ లకోసం పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్.. మరో రెండు కిలోమీటర్లు నాన్ సోలార్ రూఫ్ టాప్  ఏర్పాటు చేశారు.దీని వల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఒక మెగావాట్ సోలార్ పవర్ ను సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించనున్నారు, మిగతా 15 మెగావాట్ల విద్యుత్ ను  అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు ఉపయోగించనుంది హెచ్ఎండీఏ.  ఈ ట్రాక్  24గంటలు  అందుబాటులో  ఉండనుంది.  ట్రాక్ చుట్టూ  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.