
హైదరాబాద్ నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.హెచ్ఎండీఏ నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలో మొదటిది కావడం విశేషం. నానక్ రామ్ గూడ నుంచి టీఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు , నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు మేర మూడు లేన్ లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పు ట్రాక్, ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ,21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు... లైట్స్ ఏర్పాటు చేశారు.
Municipal Admin Minister @KTRBRS speaking after launching HealthWay - India's first solar cycling track https://t.co/pyNQTbQ0L5
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 1, 2023
సైక్లిస్ట్ లకోసం పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్.. మరో రెండు కిలోమీటర్లు నాన్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు.దీని వల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఒక మెగావాట్ సోలార్ పవర్ ను సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించనున్నారు, మిగతా 15 మెగావాట్ల విద్యుత్ ను అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు ఉపయోగించనుంది హెచ్ఎండీఏ. ఈ ట్రాక్ 24గంటలు అందుబాటులో ఉండనుంది. ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.