హైదరాబాద్: నగరంలోని బైరామల్ గూడ జంక్షన్‌లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాకు తెలిపారు. ఫ్లైఓవర్ ను 26.45 కోట్ల వ్యయంతో ప్రీ కాస్ట్ విధానంలో నిర్మాణం చేశారు. దేశంలోనే మొదటి సారి ప్రత్యేక టెక్నాలజిని వినియోగించామని ఫ్లైఓవర్ ను నిర్మించామని మేయర్ చెప్పారు. ఈ ఫ్లైఓవర్ తో బైరామల్ గూడ జంక్షన్, సాగర్‌రోడ్ జంక్షన్ పై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
ఎల్బీనగర్ నుంచి ఓవైసీ జంక్షన్ వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను 14 పిల్లర్స్‌తో నిర్మించారు. 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల దూరం నిర్మస్తున్న ఫ్లై ఓవర్ ద్వారా ఎల్బీనగర్ వైపు నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా వాహనాలు ప్రయాణం చేసుందుకు వీలుగా ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎల్బీనగర్ నుంచి బైరామల్ గూడ దారిలో 11 భవనాలను సేకరించి తొలగించారు.

