బుడ్డోడి అద్భుత‌ విన్యాసాలు.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

బుడ్డోడి అద్భుత‌ విన్యాసాలు.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌:  తోటి పిల్ల‌ల‌తో క‌ల‌సి మ‌ట్టిదిబ్బ‌ల్లో ఓ బుడ‌త‌డు చేసిన స్టంట్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఆడుకుంటున్న స‌మ‌యంలో ప్రోఫెష‌న‌ల్ జిమ్నాస్టిక్ లాగా విన్యాసాలు చేస్తూ.. అబ్బురపరుస్తున్నాడు. ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అమాంత‌తం గాల్లో ప‌ల్టీలు కొడుతున్న అత‌ని తీరు చూస్తుంటే భ‌విష్య‌త్తులో త‌ప్ప‌క గోల్డ్ మెడ‌ల్ సాధిస్తాడ‌నిపిస్తుంది. ఈ బుడ్డోడి విన్యాసాల‌కు సంబంధించిన వీడియోను పుట్ట విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. ట్విట్ట‌ర్ లో ఈ అబ్బాయి విన్యాసాలను చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ‘ఎవరీ అబ్బాయి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒలింపిక్ మెడలిస్ట్ తర్ఫీదులో ఉన్నాడంటూ కితాబునిచ్చారు. అతను తెలంగాణా లేక మరో రాష్ట్రమా అంటూ ప్రశ్నించారు. ఈ అమోఘమైన ప్రతిభావంతుడికి మద్దతు ఇవ్వాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.