ప్రధాని మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

ప్రధాని మోడీకి  కేటీఆర్ బహిరంగ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో దేఖో సీకో అంటూ ప్రధానికి లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని సూచించారు.  పార్టీ డి.ఎన్.ఏ లోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న  మోడీ ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందంటూ ఎద్దేవా చేశారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న  మోడీ ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదని మంత్రి కేటీఆర్ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ప్రాజెక్టులు, -పథకాలు, -సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయాలని లేఖలో సూచించారు. డబుల్ ఇంజిన్తో ప్రజలకు ట్రబుల్ గా మారిన  రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించాలన్నారు.