మంత్రి మల్లన్న స్టయిలే వేరు..

మంత్రి మల్లన్న స్టయిలే వేరు..

మంత్రి మల్లారెడ్డి తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు.

వారిని పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో మంత్రి మల్లారెడ్డి ఉత్సాహంతో గౌరమ్మ అనే వృద్ధురాలిని తన ఒడిలో కూర్చొబెట్టుకున్నారు. తర్వాత ఆమెకు బొకె అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. మల్లన్న తీరే వేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.