ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రిలో టిఫా స్కానింగ్ సెంటర్ను ప్రారంభించిన మల్లారెడ్డి

ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రిలో టిఫా స్కానింగ్ సెంటర్ను ప్రారంభించిన మల్లారెడ్డి

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రిలో టిఫా స్కానింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. టిఫా స్కానింగ్ ద్వారా గర్భిణులు పిల్లల ఎదుగుదల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. 28 లక్షలతో టీఫా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మల్లారెడ్డి అన్నారు. పేదల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో ఘట్కేసర్ మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.