వర్షాల వల్ల అసలు పంట నష్టమే జరగలేదు- మంత్రి నిరంజన్ రెడ్డి

వర్షాల వల్ల అసలు పంట నష్టమే జరగలేదు- మంత్రి నిరంజన్ రెడ్డి

ఢిల్లీ- కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడని కలిశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రిని కలిశాన‌ని తెలిపిన నిరంజ‌న్ రెడ్డి..రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులు , ఎరువుల అవశ్యకథ గురించి కేంద్ర మంత్రికి చెప్పానన్నారు. ఎప్పుడు లేని విదంగా రాష్ట్రంలో వ్యవసాయం విస్తారంగా పండించారని, వర్షాలు కూడా విస్తారంగా కురుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయని.. ఈసారి ఎన్నడు లేని విదంగా కోటి ఇరవై లక్షల ఎకరాలలో రైతులు వివిధ పంటలు వేశారన్నారు. ఎనిమిది లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని, దేశంలో ఈ స్థాయిలో సాగు విస్తీర్ణం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం కోసం సానుకూల నిర్ణయాలు తీసుకోవటం వల్లనే రైతులు ఈ స్థాయిలో పంటలు వేశారన్నారు.

వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రనికి ఎరువులు ఎక్కువగా కేటాయించాలని కేంద్ర‌మంత్రిని కోరామని తెలిపిన నిరంజ‌న్ రెడ్డి.. రాష్ట్రంలో పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, మిగతావి 11 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్పామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని..ఎక్కడ ఏ మండలాల్లో,ఏ ఊరిలో ఎంత వర్షం పడుతుందో అధికారులు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా పంటలు నష్టం జరగలేదని… వరి సాగుకి నష్టం లేదన్నారు. పత్తి పంటకు కూడా నష్టం లేద‌ని ఎక్కడన్న నీళ్లు మల్లుకుంటే కాపర్ కార్బోనేట్ స్ప్రే ద్వారా పత్తి పంటను కపడుకోవచ్చ‌ని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.