క్యూలైన్ లో రైతు చనిపోవడం యాదృచ్చికం

క్యూలైన్ లో రైతు చనిపోవడం యాదృచ్చికం

హైదరాబాద్ : యూరియా కొరత ఎక్కడా లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రానికి యూరియా రావడంలో ఒక్కోసారి రెండు రోజులు… ఇంకోసారి 4 రోజులు వివిధ కారణాల వల్ల ఆలస్యమవడం సాధారణమే అన్నారు. వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కొరత లేదని అన్నారు. అక్కడి ఎమ్మెల్యే రామలింగారెడ్డితో తాను మాట్లాడానని అన్నారు. యూరియా కోసం లైన్ లో నిలబడ్డ రైతు.. గుండెపోటుతో మరణించాడని అన్నారు. రైతు మరణానికి, యూరియా కి ఎలాంటి సంబంధం లేదనీ.. అది యాదృచ్చికంగా జరిగిందని అన్నారు. మరో వారం, పది రోజుల్లో పెండింగ్ లో ఉన్న రైతు బంధు బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.

మాదాపూర్ హైటెక్స్ లో అగ్రి టెక్స్  7వ ఎడిషన్ 2019ను ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవాల్టి నుండి మూడు రోజుల పాటు అగ్రిటెక్స్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్ లాంచింగ్ లో మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాకలో రైతు మరణంపై స్పందించారు.