2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​: మంత్రి నిరంజన్‌‌రెడ్డి

2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్​: మంత్రి నిరంజన్‌‌రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో 2.18 లక్షల  టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌రెడ్డి వెల్లడించారు.  ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల  టన్నులు, కంపెనీ గోడౌన్లల్లో 6 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. 

రాబోయే నాలుగు రోజులలో  మరో 18 వేల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా జిల్లాల్లో  పంటలసాగుకు తగిన ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి హెచ్చరించారు.