రైతు బంధు కోసం రూ14,600 కోట్ల విడుదల చేస్తున్నాం

రైతు బంధు కోసం రూ14,600 కోట్ల విడుదల చేస్తున్నాం

మహబూబాబాద్ జిల్లా; రైతుల సమస్యలను పరిష్కించాలన్న‌ అలోచతోనే రైతు వేదిక లు ఏర్పాటు చేశామ‌ని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. శ‌నివారం మహబూబాబాద్ జిల్లాలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రైతులుకు అండగా నిలబ‌డే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమ‌ని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా.. వాటిని తిప్పికొట్ట‌డానికి తాము సిద్దంగా వున్నామ‌న్నారు. జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికల పనులు పూర్తి చేసినందుకు ‌ సర్పంచ్‌లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. మహబూబాబాద్ జిల్లా కు మరికొన్ని రైతు వేదిక లు మంజూరు చేస్తామ‌ని చెప్పారు. పోడుభూముల సాగుచేసుకుంటన్న రైతులకు తప్పకుండా పట్టాలు ఇచ్చి అదుకుంటామ‌ని చెప్పారు.

స‌మావేశంలో పాల్గోన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎక్కడ చూసిన భూములు మొత్తం ఎడారి గా వుండేవ‌ని, తెలంగాణ వచ్చిన తర్వాత భూముల మొత్తం పంటలతో కళకళ లాడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతుందని.. ప్ర‌స్తుతం రాష్ట్రం లో వలసలు అరికట్టామ‌ని అన్నారు. ఈ నెల డిసెంబ‌ర్ 20 నుండి వచ్చే నెల జ‌న‌వ‌రి 7 వరకు రాష్ట్రంలో వున్న 59 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద 14.600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా అన్నారు.

ఢిల్లీ లో రైతులు ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రైతులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామ‌న్నారు