
మహబూబ్ నగర్: తెలంగాణ పాలనలో ఎలాంటి కక్ష పూరిత రాజకీయాలుండవని, ఎవరి మీద వివక్ష లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ చట్టం పరిధిలో ఉన్న అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు. సర్పంచుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించి, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చట్టబద్దంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవకాశమే లేదని, చట్టసవరణకు ముమ్మాటికీ సీఎం అంగీకరించరన్నారు. చట్టం ప్రకారమే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. సవరణలకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారమే గ్రామపంచాయతీల అభివృద్ది జరుగుతుందన్నారు.