క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

రంగారెడ్డి: ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని కేఎల్ యూనివర్సిటీ, న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలని అన్నారు. మన దేశంలో పుట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని, అందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. ఇప్పటి నుంచే యోగాను అలావాటు చేసుకోవడంద ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యాలను సులభంగా అందుకోవచ్చని సూచించారు.  క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. క్రీడాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి... ఈ క్రమంలోనే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నరేష్, యోగా గురువులు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.