
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మీద కేటీఆర్ పదే పదే మొరగొద్దు.. అనవసరంగా ఎగసిఎగసి పడొద్దని హెచ్చరించారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో పల్లె దవాఖాన ను ప్రారంభించారు పొన్నం. .ఈ సందర్బంగా ప్రజలు తీర్పు ఇచ్చి ఇంకా 60 రోజులు కాలేదు..ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
ప్రపంచంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు పొన్నం. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పదే పదే కాంగ్రెస్ నేతల బట్టలిప్పుతానంటున్న కేటీఆర్ తన అహంకార పూరిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. పదేండ్లు పరిపాలన చేసిన ఏమైనా ఉంటే పోలీసులతో అరెస్ట్ చేయించాలన్నారు.
కాంగ్రెస్ వి 420 హామీలని..ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల బట్టలిప్పి తరిమి కొడ్తామని కేటీఆర్ పదేపదే విమర్శిస్తున్నారు. కారు సర్వీసింగ్ కు పోయిందని మళ్లీ 100 స్పీడుతో దూసుకొస్తుందన్నారు.